ఆగని వైసీపీ నేతల దాడులు !

ఆగని వైసీపీ నేతల దాడులు !

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో పలు అనుచిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  కొన్ని చోట్ల వైసీపీ నేతలు తమకు మద్దతివ్వడంలేదని దాడులకు దిగుతున్నారు.  కొన్నిరోజుల క్రితమే జనసేనకు మద్దతు పలికినందుకు గర్భిణిపై దాడి చేసిన వైసీపీ నేతలు తాజాగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అలాంటి పనే ఒకటి చేశారు.  

శాంతిపురం మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వసంతమ్మ గత కొన్ని సంవత్సరాలుగా ఒకరింట్లో నివాసం ఉంటోంది.  అయితే ఆమె టిడిపి ఎన్నికల ప్రచారానికి వెళ్లిందని కోపగించుకున్న  వైసీపీ నేతలు ఆమెను  ఇంటి నుంచి ఖాళీ చేసి బయటికి పంపించేశారు