టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ..

టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసాయి.. ఇప్పుడు మొత్తం వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ తిరుగుతోంది... ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ని కలిసి ఫిర్యాదు చేయగా... ఇవాళ సీఈసీని కవలనున్నారు వైసీపీ నేతలు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ నేతలు, మాజీ ఎంపీలు టీమ్‌గా వెళ్లి సీఈసీతో భేటీకానున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో టీడీపీ శ్రేణులు అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తున్నాయంటూ ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీ స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రితో పాటు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. ఈనెల 11న పోలింగ్ సందర్భంగా, తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరుగుతోన్న దాడులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నారు వైసీపీ నేతలు.