పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు... అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి...!

పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు... అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి...!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... భూముల వ్యవహారంలో తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ చీఫ్ చంద్రబాబు కొత్త బినామీ పవన్‌ కల్యాణ్‌ అని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారని విమర్శించిన ఆర్కే.. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి పవన్‌ ప్యాకేజీలు తీసుకున్నాడని ఆరోపించారు. పవన్‌ ప్యాకేజీ తీసుకున్నాడనటానికి నిదర్శనమే.. మంగళగిరిలో జనసేన పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకపోవడంగా చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే. ఐదేళ్లు రాజధానిలో అవినీతి జరిగితే పవన్ ఏమయ్యాడని ప్రశ్నించిన ఆర్కే.. రాజధాని విషయంలో ప్యాకేజి తీసుకుని పవన్ సైలెంట్ అయిపోయాడని.. రాజధాని రైతుల్ని ప్రత్యక్షంగా చంద్రబాబు మోసం చేస్తే.. ప్యాకేజీ తీసుకుని పవన్ పరోక్షంగా మోసం చేశారని సంచలన ఆరోపణలు గుప్పించారు.