దీక్షల పేరుతో ప్రజల సొమ్ము‌ దుర్వినియోగం...

దీక్షల పేరుతో ప్రజల సొమ్ము‌ దుర్వినియోగం...

నవనిర్మాణ దీక్ష పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ వేదికలుగా మారుస్తోందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... నవ నిర్మాణ దీక్షలకు, ధర్మ పోరాటాలకు ప్రజా సొమ్మును‌ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దీక్షల్లో చేసేవన్నీ చంద్రబాబు ప్రతీరోజూ చేసే కార్యక్రమాలేనని విమర్శించిన బుగ్గన... దీక్షలు, పోరాట దీక్షలకు ప్రభుత్వ ఉద్యోగులను‌ పలిపిస్తున్నారని, సెలవు రోజుల్లో ఉద్యోగులను ఇంటికి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అర్థంలేని కార్యక్రమాలతో ఏటా 50 - 75 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులను విధులకు హాజరు కానీవ్వకుండా చేస్తున్నారని వెల్లడించారు. 

ప్రభుత్వ ఉద్యోగులను వీడియో కాన్ఫరెన్స్‌ల పేరుతో సీఎం చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... గత ఏడాది నవ నిర్మాణ దీక్షలో ప్రగతి ప్రశ్నల పేరుతో కాంగ్రెస్ ను బహిష్కరించాలని చెప్పిన చంద్రబాబు... కర్ణాటకలో రాహుల్ గాంధీతో  స్నేహం ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జన్మభూమి, మా ఊరు, పల్లె నిద్ర, సంకల్ప దీక్ష... లాంటి ‌పడికట్టు పదాల పేర్లతో జనాన్ని మభ్య పెడుతున్నారని విమర్శించారాయన. దోమలపై దండయాత్ర పేరుతో సీఎం బాహుబలి లాగా వేయిస్తున్న ఫ్లెక్సీలను చూసి జనం నవ్వుతున్నారంటూ