త్యాగాలకు సిద్ధమే..!

త్యాగాలకు సిద్ధమే..!

రాజన్న రాజ్యం కావాలన్నదే మా ధ్యేయం.. పదవుల విషయంలో త్యాగాలకు సిద్ధమే అనే ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి.. రాజన్న రాజ్యం కావాలన్నదే మా ధ్యేయం అన్నారు. కేబినెట్‌ కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో త్యాగాకు సైతం సిద్ధమని తెలిపారాయన. కష్టకాలంలో సైతం వైఎస్ జగన్ వెన్నంటి ఉన్న శ్రీకాంత్‌రెడ్డికి.. జగన్ నమ్మిన వ్యక్తిగా పేరుందు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రాయచోటి నుంచి మరోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే.