నాకు మంత్రి పదవి వద్దనలేదు..!

నాకు మంత్రి పదవి వద్దనలేదు..!

కేబినెట్ కూర్పు వివరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతుండడంతో కేబినెట్‌లో స్థానం ఆశించేవారు వారి అభిప్రాయాలను బయటపెడుతున్నారు. కేబినెట్‌ విస్తరణపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. తనకు మంత్రి పదవి వద్దని నేను ఎప్పుడూ అనలేదని.. ఆలా ప్రచారం జరగడం అబద్ధమన్నారు. మేం 151 మంది ఎమ్మెల్యేలమంతా నిజానికి ముఖ్యమంత్రులం అనుకుంటున్నామని.. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో సస్పెన్షన్‌కు గురైన రెండో వ్యక్తిని తానేనంటూ గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.