ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా...

ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా...

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతోంది.  గత రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.  తాజాగా ఏపీలో 6235 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు.  రాష్ట్రంలో ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  తాజగా వైసీపీ నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు కరోనా బారిన పడ్డారు.  గత నాలుగు రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు.  ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అయన హోమ్ క్వారంటైన్ చికిత్స పొందుతున్నారు.  గత నాలుగు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని మొండితోక జగన్మోహన్ రావు కోరారు.