'నా కష్టం ఏంటో సీఎం జగన్‌కు తెలుసు..'

'నా కష్టం ఏంటో సీఎం జగన్‌కు తెలుసు..'

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్నారు ఆ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనడానికి తాడేపల్లి వచ్చిన ఆమె.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ... నేను ఐరన్ లెగ్ కాదు.. నేను అడుగుపెట్టిన అన్ని రంగాల్లో విజయం సాధించా.. కాబట్టి తనది గోల్డెన్ లెగ్‌గా అభివర్ణించారు. ఇక చంద్రబాబు తనపై దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు. ఇక, నాకు మంత్రి పదవి ఇవ్వలా? వద్దా? అనేది సీఎం వైఎస్ జగన్ నిర్ణయిస్తారన్న రోజా.. నాకు మంత్రి పదవి కావాలని నేను ఇంత వరకూ ముఖ్యమంత్రిని అడగలేదన్నారు.