జేసీ దివాకర్‌రెడ్డికి రోజా కౌంటర్...

జేసీ దివాకర్‌రెడ్డికి రోజా కౌంటర్...

వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడిపై వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా... హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె... కోడి కత్తిని తెచ్చుకుని ఓసారి జేసీ దివాకర్ రెడ్డి పొడుచుకుని చూడాలి... దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుందంటూ సెటైర్లు వేశారు. ఎయిర్ పోర్ట్ సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యం వల్ల ఆయన్ను అన్ని విమానయాన సంస్థలు బ్యాన్ చేసిన విషయాని జేసీ మరచిపోయినట్టున్నారు అంటూ ఎద్దేవా చేశారు. తన ట్రావెల్స్ వల్ల ఎంతమంది జీవితాలను ఆయన పొట్టన పెట్టుకున్న విషయం మరచిపోయారా? అంటూ మండిపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి బృందం కులరాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా.