జగన్ అప్‌కమింగ్.. బాబు ఔట్‌ గోయింగ్ సీఎం..!

జగన్ అప్‌కమింగ్.. బాబు ఔట్‌ గోయింగ్ సీఎం..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అప్‌కమింగ్ సీఎం అయితే.. చంద్రబాబు ఔట్ గోయింగ్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కో రోజా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన ఆమె... గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అన్నవారికి ఇది చెంపపెట్టు అన్నారు. రాజధానిలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేని  పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఉన్నారని.. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం ఇలా అన్నీ తాత్కాలికమే అంటూ సెటైర్లు వేశారు రోజా. ఇక 2014 వరకు కూడా చంద్రబాబు.. హైదరాబాద్ లో ఓటు వేస్తే, జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా లో ఓటు వేశారని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్,  ప్రధాని మోడీ, వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారనే చంద్రబాబు.. 2014లో మోడీకి ఓటు వేశానని సిగ్గులేకుండా చెప్పారంటూ మండిపడ్డారు. ఇక జగన్‌ గృహప్రవేశానికి తనను ఆహ్వానించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు రోజా.