లాంఛనమే..

లాంఛనమే..

ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ భేటీలో శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ ఒక్క అజెండాతోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఇక ఈ సమావేశం అనంతరం.. ఈ తీర్మాన ప్రతిని తీసుకుని హైదరాబాద్‌ వెళ్లనున్న వైసీపీ అధినేత... సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి సమర్పించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు శాసనసభాపక్షం సమావేశమైన తర్వాత ఉదయం 11:30 గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.