లోక్ సభలో దిశ చర్చ జరుగుతుంటే... వైకాపా ఎంపీ ఏం చేశాడో చూశారా? 

లోక్ సభలో దిశ చర్చ జరుగుతుంటే... వైకాపా ఎంపీ ఏం చేశాడో చూశారా? 

పార్లమెంట్ లోని ఉభయ సభల్లో ఈరోజు దిశ అత్యాచారం, హత్య ఘటనపై అట్టుడికిపోయింది.  జీరో అవర్ సమయంలో రాజ్యసభలో దీనిపై చర్చ జరిగింది. ఆ తరువాత మధ్యాహ్నం సమయంలో లోక్ సభలో దిశ అత్యాచారం ఘటనపై చర్చ జరిగింది.  దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వేధింపులు తదితర అంశాలపై సీరియస్ గా చర్చ జరుగుతున్న సమయంలో వైకాపా ఎంపీ హాయిగా కునుకుతీస్తూ కనిపించారు.  

ఇదే అంశంపై సభలోని అందరు పార్టీలను పక్కన పెట్టి చర్చ జరుపుతున్నారు.  మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది.  తీసుకొచ్చే కఠినమైన చట్టాలు ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చలు జరుగున్నాయి.  అదే సమయంలో తనకేమి పట్టదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ నిద్రపోతూ కనిపించారు.దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.