వైకాపా ఎంపీ విందులో ఇదే హైలైట్... !!

వైకాపా ఎంపీ విందులో ఇదే హైలైట్... !!

వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈనెల 11 వ తేదీన భారీ ఎత్తున ఓ పార్టీని ఇస్తున్నారు.  ఈ పార్టీకి దాదాపుగా మూడువేల మంది వీవీఐపిలు, వీఐపీలు హాజరవుతున్నారు.  ఈ విందులో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు, రాజకీయ నాయకులు, సినీ తారలు హాజరవుతున్నారు.  దాదాపు 100 రకాల పదార్ధాలు విందులో సందడి చేయబోతున్నాయి.  

ఇక ఇదిలా ఉంటె, ఈ విందులో కిళ్ళీ హైలైట్ అవుతున్నది.  ఈ కిళ్ళీ ఖరీదు రూ . 1000 ఉందని, ఈ స్థాయిలో ఉన్న కిళ్ళీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  రఘురామ కృష్ణంరాజు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.