ఫ్లాప్ మూవీలో పవన్ ద్విపాత్రాభినయం..! సాయిరెడ్డి సెటైర్లు

ఫ్లాప్ మూవీలో పవన్ ద్విపాత్రాభినయం..!  సాయిరెడ్డి సెటైర్లు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి... కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరణకు చూపిస్తూ ఆయన ఎద్దేవా చేశారు.. "ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్‌గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు... కానీ, ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్‌గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు... సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.'' అంటూ కామెంట్  చేసిన సాయిరెడ్డి... ఇక, "రేప్ చేస్తే ఉరి తీస్తారా?రెండు బెత్తం దొబ్బలు కొడితే చాలని ‘తీర్పు’ చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి... తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు... పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబ్తుండటం దురదృష్టం.'' అంటూ మరో ట్వీట్ చేశారు సాయిరెడ్డి. వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ విమర్శలు, ఆరోపణలు చేస్తుండడంతో.. వైసీపీ నేతలు కూడా పవన్‌ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.