కమెడియన్‌గా చంద్రబాబు..! సాయిరెడ్డి తాజా సెటైర్లు..!

కమెడియన్‌గా చంద్రబాబు..! సాయిరెడ్డి తాజా సెటైర్లు..!

వైసీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీలో కీలకనేత అయిన విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ.. సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అయినా.. టీడీపీ నేతలను, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్లు ఎక్కుపెడుతూనే ఉన్నారు.. ఇక, మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సాయిరెడ్డి. ప్రతిరోజు కనీసం 3 గంటలైనా మైకులో మాట్లాడకపోతే బాబుకు భోజనం సహించదు.. నిద్ర పట్టదని సెటైర్లు వేశారు. ఎక్కడకు వెళ్లినా.. కమెడియన్‌ తరహాలో కార్యకర్తలను ఆహ్లాదపరచడంపైనే చంద్రబాబు దృష్టిపెట్టినట్టు ఉన్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఎవరిచ్చారు మీకీ అధికారం అంటూ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు విజయసాయిరెడ్డి.