త్వరలోనే వైసీపీలోకి మరిన్ని ఆసక్తికర చేరికలు..!

త్వరలోనే వైసీపీలోకి మరిన్ని ఆసక్తికర చేరికలు..!

సార్వత్రిక  ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన నేతలను వైసీపీలో చేర్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దీంతో వైసీపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతలను ముందే ఇచ్చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో పెద్దగా చేరికలు ఏమీ లేవు.. కానీ, ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో మరోసారి చేరికలు భారీగా ఉంటాయనే సంకేతాలను ఇచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి... ఆసక్తికర చేరికలు ఉంటాయని ప్రకటించారు. చంద్రబాబు అధికారం కోల్పోయాక కూడా తన తీరు మార్చుకోలేదు.. దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని.. అందుకే తమ వైపు చూస్తున్నారనే తెలిపారు సాయిరెడ్డి.