23వ తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి..!

23వ తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. చంద్రబాబును టార్గెట్ చేస్తూ రోజూ ట్వీట్లు చేసే సాయిరెడ్డి... ఇవాళ ఇలా స్పందించారు.. ''ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు. వీవీ ప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయి.'' అని ట్వీట్ చేశారు. ఇక ''ఈ నెల 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు.'' అంటూ మరో హాట్ ట్వీట్ వేశారు. మరోవైపు ''ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను  ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు.'' అంటూ మూడో ట్వీట్‌లో ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.