ఇన్నాళ్లు కళ్లుగప్పారు..! ఇక సాధ్యం కాదు..

ఇన్నాళ్లు కళ్లుగప్పారు..! ఇక సాధ్యం కాదు..

ప్రజా వేదికను కూల్చివేస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజావేదికను కూల్చడమేంటి? అక్రమమో సక్రమో పక్కన పెడితే.. అక్ర నిర్మాణాలను అన్నీ కూల్చిన తర్వాత.. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చండి అనే సలహాలు ఇస్తున్నారు. అయితే, దీనిపై తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో స్పందించిన ఆయన "నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవి. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు. ఇకపై సాధ్యం కాదు.'' అంటూ హెచ్చరించారు. 

ఇక "విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు తీసుకున్నయూ-టర్న్ వల్ల పనులు మొదలు కాకుండా పోయాయి. మొదట భూసేకరణ తామే చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చి తర్వాత చెరిసగం భరించాలని మెలిక పెట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.'' అని నిన్న రాజ్యసభలో జరిగిన చర్చను కూడా సోషల్ మీడియాలో ప్రస్తావించారు సాయిరెడ్డి.