వైసీపీ ఎంపీలకు విజయసాయి దిశానిర్దేశం..

వైసీపీ ఎంపీలకు విజయసాయి దిశానిర్దేశం..

లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంట్‌ హాల్‌లో వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు.
అంతకముందు ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 25 మంది ఎంపీలు సభలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి ముందుగా ప్రమాణం చేశారు.