వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. 

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం ఉదయం పోలీసులకు లొంగిపోయారు.  తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని మహిళ ఎంపిడివో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు గత రాత్రి నుంచి ప్రయత్నాలు జరిగాయి.  ఆయన ఇంటిదగ్గర హైడ్రామా జరిగింది.  అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే ఇంటిదగ్గర పోలీసులు అయన కోసం వేచి చూశారు.  ఆయన లేకపోవడంతో రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు.  

కాగా ఈ ఉదయం కోటం రెడ్డి డైరెక్ట్ గా పోలీసులకు లొంగిపోయారు.  రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.  అనంతరం ఆయన్ను వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది.  ప్రైవేట్ అపార్ట్మెంట్ పంచాయితీ పైప్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామ సచివాలయ పరీక్షల ఉన్నందువలన ఆయన దరఖాస్తుకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు ఆలస్యం అయ్యింది.  దీంతో ఆయన ఎంపిడివో ను బెదిరించారట.  దీంతో ఆమె తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పు చేస్తే ఎవరైనా సరే ఒక్కటే అని ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అయ్యారు.