వైసీపీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం..

వైసీపీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ నేతృత్వంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చిస్తన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారమే అజెండాగా సభలోవాణి వినిపించాలని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర  సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చిస్తున్నారు.  లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపీలంతా సమావేశానికి హాజరయ్యారు.