వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా..

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక వాయిదా..

తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. మొదట ఎమ్మెల్యేలు సమావేశమై.. శాసనసభాపక్ష నేతగా జగన్‌ను ఎన్నుకుంటూ ఏకవాక్యతీర్మానం చేయగా... అనంతరం ఎంపీలు పార్టీ అధినేతతో భేటీఅయ్యారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. అయితే, పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరినీ ఎన్నుకోకుండా సమావేశం ముగిసింది. పార్లమెంటరీ నేతను ఎన్నుకునే నిర్ణయాన్ని అధినేత జగన్ కే అప్పగించారు ఎంపీలు. ఇక ప్రత్యేక హోదా కోసం అందరూ కృషి చేయాలని ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్.