రఘురామకు వైసీపీ షాక్..మీరు రావద్దు!

రఘురామకు వైసీపీ షాక్..మీరు రావద్దు!

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని, అంశాలను వివరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రఘురామ ను ముందుగా ఏపీ భవన్ అధికారులు ఆహ్వానించారు. కాగా మళ్ళీ కొద్దిసేపటి తరవాత ఫోన్ చేసి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావద్దని తేల్చి చెప్పారు. మొదట సమాచారం ఇవ్వడంతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న రఘురామకృష్ణంరాజు మళ్ళీ రావద్దంటూ సమాచారం అందించడంతో కంగు తిన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సొంత పార్టీలో ప్రతిపక్షం లాగా మారిన రఘురామ పార్టీలో ఉంటూనే పార్టీ విధానాలను తప్పు పడుతున్నారు. దాంతో కొద్దిరోజులుగా ఆయనపై ఎమ్మెల్యేలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.