గెలిచినా, గెలవకపోయినా నేను మీ వాడినే..

గెలిచినా, గెలవకపోయినా నేను మీ వాడినే..

గెలిచినా.. గెలవకపోయినా.. నేను ఎప్పటికీ విజయవాడ వాడినే అన్నారు వైసీపీ నుంచి బెజవాడ లోక్‌సభ బరిలో దిగి ఓటమిపాలైన పొల్లూరి వీరప్రసాద్ (పీవీపీ)... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రతీ ఇంటికి నేను, మా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటామన్న పీవీపీ... 130 స్ధానాలకు పైగా వైసీపీ గెలుస్తుందని అనేక సార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదు.. కానీ, 151 స్థానాలతో వైసీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. చాలా తక్కువ మార్జిన్ తోనే ఓడిపోయాను... రాజకీయాల్లోకి చివర్లో వచ్చాను.. నేను 19 రోజులే పార్లమెంట్ పరిధిలో తిరిగాను... ముందు వచ్చి ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాడినన్నారు పీవీపీ. ఇక నుండి రెగ్యులర్ గా విజయవాడ ప్రజలతోనే ఉంటానని ప్రకటించారు.