గుడివాడ మున్సిపల్ చైర్మన్‌పై దాడి..

గుడివాడ మున్సిపల్ చైర్మన్‌పై దాడి..

కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుపై దాడికి దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మచిలీపట్నంలోని కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న యాలవర్తి శ్రీనివాసరావు కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దాడిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. వైసీపీ కార్యకర్తల దాడిలో యాలవర్తి శ్రీనివాసరావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్‌... కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో దాడి నుంచి తప్పించుకున్నట్టయ్యింది.