నెల్లూరులో రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు !

నెల్లూరులో రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు !

ఎన్నికలు ముగిసినా కొన్ని జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గలేదు.  ప్రధాన పార్టీలు టీడీపీ, వైకాపా మధ్యన గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.  తాజాగా నెల్లూరు జిల్లా నెల్లూరులో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడిపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయులు రాడ్లతో దాడి చేశారు.  ఈ దాడిలో తిరుమల నాయుడు తీవ్రంగా గాయపడటం జరిగింది.  ఎన్నికల్లో తమకు సహకరించలేదని అక్కసుతోనే వైకాపా వర్గీయులు ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.  కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.