వైఎస్సార్ యాత్ర టీజర్ వచ్చేస్తోంది.. 

వైఎస్సార్ యాత్ర టీజర్ వచ్చేస్తోంది.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గస్థులు రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కొద్దీ రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. జూలై 8న రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయనున్నామని యాత్ర టీం అధికారికంగా తెలిపింది.ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుకుని ముఖ్యమంత్రిగా చేసిన పనులు, రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించనున్నారు. ఈ సినిమాను విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్దీ రోజుల్ క్రితమే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే మంచి పాజిటివ్ హైప్ ని క్రియేట్ చేసుకోగా..ఇప్పుడొచ్చే టీజర్ ఏ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మమ్ముట్టి లుక్ పరంగా బాగా ఇమిడాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.