రజనీ సినిమాలో యువరాజ్ సింగ్ తండ్రి

రజనీ సినిమాలో యువరాజ్ సింగ్ తండ్రి

యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ ముగించాక పంజాబీ సినీ పరిశ్రమలో ప్రవేశించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  ఈయన ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న 'దర్బార్' సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.  చిత్ర యూనిట్ సభ్యుల కథనం మేరకు యోగ్‌రాజ్ సింగ్ రజనీతో కలిసి ఒక ఫైట్ సీన్లో కనిపిస్తారట.  ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కూడా ఓకే కీ రోల్ చేస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదలచేయనున్నారు.