'నాకు నచ్చలేదు' అంటూ యువీ పై అతని భార్య ఆగ్రహం... 

'నాకు నచ్చలేదు' అంటూ యువీ పై అతని భార్య ఆగ్రహం... 

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ గురించి తెలిసిందే.. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటూ నిత్యం జరుగుతున్న సంఘటనల పై స్పందిస్తూ, తన తోటి ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగే తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అలా యువీ తాజాగా తాను జిమ్‌లో సాధన చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. దాని పై అతని భార్య హాజెల్‌ కీచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎందుకంటే.. యువీ పోస్ట్ చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆవిడ కూడా కనిపిస్తున్నారు. దాంతో... 'యువీ.. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో నేను కనిపించడం నచ్చలేదు' అంటూ కామెంట్ జత చేసారు. ఇక వెంటనే భార్యా ఆగ్రహాన్ని దూరం చేయడనికి యువరాజ్‌ ఆ వీడియోను డిలీట్ చేసారు. కానీ ఇంతలోనే దాని పై మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్‌ స్పందిస్తూ... 'భాయ్‌ నాకు ఆ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ఇవ్వండి' అని కామెంట్‌ చేశాడు. చూడాలి మరి యువీ తనకు ఎలాంటి ఛాలెంజ్ విసురుతాడు  అనేది.