బుమ్రా పెళ్లి పై స్పందించిన యువీ...

బుమ్రా పెళ్లి పై స్పందించిన యువీ...

టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడటం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే బుమ్రా పెళ్లిపై వస్తున్న రూమర్ల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ స్పాంటేనియస్‌గా స్పందించాడు. బుమ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను ట్రోల్ చేశాడు. ముందుగా బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశాడు. దానికి యువరాజ్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఫోటోను ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశాడు. 'స్వీప్ చేయడం గురించి థింక్ చేస్తున్నాడు' అంటూ కామెంట్ చేశాడు యూవీ.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం (మార్చి 4) నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే, కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్‌ నుంచి వైదొలగాలని బుమ్రా నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా చెప్పాడు. అయితే బుమ్రా గాయాల కారణంగానే ఈ మ్యాచ్‌ నుంచి వైదొలగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ, అదంతా వట్టి పుకార్లేనని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఫిట్‌నెస్ విషయంలో బుమ్రా గురించి ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పింది. బుమ్రా కొంత విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడని, అదే విషయాన్ని చెప్పాడని బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే బుమ్రా విశ్రాంతికి గల నిర్ధిష్ట కారణాన్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ఇక ఇంగ్లండ్‌తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి భారత స్పేసర్ బుమ్రా వైదొలిగాడు. ఇక వన్డే సిరీస్‌లో ఆడటం కూడా అనుమానంగానే కనిపిస్తోంది.