యువరాజ్ సింగ్ సంచలన నిర్ణయం..

యువరాజ్ సింగ్ సంచలన నిర్ణయం..

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు... 2011 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌.. 2019 వరల్డ్ కప్ జరుగుతోన్న వేళ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సిక్సర్ల వీరుడిగా, అండర్ 14, అండర్ 19, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ క్రికెట్ లో మెరిసిన యువీ.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడిన యువీ.. ఆ తర్వాత కోలుకుని మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించాడు. అయితే, అనుకున్న సాఫీగా యువీ క్రికెట్ కెరీర్ సాగలేదు... కొద్ది నెలల క్రితం తాను వరల్డ్ కప్ 2019 వరకూ క్రికెట్ ను వీడేదిలేదని స్పష్టం చేసిన యువీ.. ఈ సారి వరల్డ్ కప్‌ జట్టులో లేకపోవడంతో.. ఓవైపు ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే, యువీ రిటైర్ అయినా.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడట.

కెరీర్ వివరాలు..

* 304 వన్డేల్లో 8,701 పరుగులు 
* 40 టెస్టుల్లో 1,900 పరుగులు
* 58 టీ20ల్లో 1,177 పరుగులు
* 2000 సంవత్సరంలో వన్డే కెరీర్ ప్రారంభం
* 2003లో టెస్ట్ కెరీర్ ప్రారంభం
* 2017లో వెస్టిండీస్ తో చివరి వన్డే 
* 2012లో చివరి టెస్ట్ 
* 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 మ్యాచ్ లు 
* వన్డేల్లో 14 సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు 
* 2011 ప్రపంచ కప్ లో భారత్ విజయంలో కీలకపాత్ర, ఆల్‌రౌండర్ షో 
* 2011లో క్యాన్సర్ బారిన పడి కెరీర్ లో వెనుకంజ