క్లారిటీ ఇచ్చిన యువరాజ్... అది పచ్చి అబద్ధం..!

క్లారిటీ ఇచ్చిన యువరాజ్... అది పచ్చి అబద్ధం..!

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్... కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారని ప్రచారం జోరుగా సాగింది.. అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్ గుడ్‌చెప్పిన యూవీ.. అప్పుడప్పుడు ఇతర టీ-20, టీ-10 మ్యాచ్‌ల్లో మాత్రం మెరుస్తున్నాడు.. అయితే.. ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ త్వరలో ఓ వెబ్ సిరీస్‌ద్వారా తెరంగేట్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా కోడై కూసింది.. ఈ వార్త కాస్త వైరల్‌గా మారిపోయింది.. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్ నిర్మించిన వెబ్‌సిరీస్‌లో యూవీ నటిస్తున్నట్లు ప్రచారం జరగగా.. యూవీ సోదరుడు జోరవర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సిరీస్‌లో యూవీ.. ఆయన భార్య హాజెల్ కీచ్, తల్లి శబ్నమ్ సింగ్‌ కూడా నటిస్తున్నట్టు వార్తలు షికారు చేశాయి.. దీనిపై సోషల్ మీడియా వేదికగానే క్లారిటీ ఇచ్చారు యువరాజ్ సింగ్.. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేసిన ఆయన.. వెబ్‌సిరీస్‌లో తన సోదరుడు నటిస్తున్నాడని క్లారిటీ ఇస్తూనే.. తాను నటించడంలేదని.. తాను నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం అంటూ తేల్చేశారు. మీడియాలో ఉన్న నా స్నేహితులు ఇది సరిదిద్దుకోవాలని సూచించారు యూవీ.