యువీకి బీసీసీఐ గుడ్‌న్యూస్ పక్కా..!

యువీకి బీసీసీఐ గుడ్‌న్యూస్ పక్కా..!

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్.. అంతేకాకుండా, దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా.. తన ఆటను మాత్రం కొనసాగించాలనుకుంటున్నాడు. దీని కోసం బీసీసీఐ అనుమతితో విదేశీ లీగుల్లో ఆడాలని ఉద్దేశంతో ఉన్నాడు. అయితే, బీసీసీఐ యువరాజ్‌  సింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటున్నారు బీసీసీఐలోని ఓ అధికారి. యువరాజ్ ఇంకా బోర్డును అనుమతి కోరుతూ లేఖ రాయలేదు. అందిన వెంటనే దానిని పరిశీలిస్తామన్నారు. అయితే, యువరాజ్ ఐపీఎల్‌ ఆడటం లేదు కాబట్టి విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించేందుకు అవకాశాలు చాలా తక్కువని.. అతడి స్థాయి గల మాజీ క్రికెటర్లు భారత్‌ ఆవల ఆడేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఇక, రిటైర్మెంట్ ప్రకటించిన సెహ్వాగ్‌ విదేశీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు యువరాజ్‌ సింగ్‌ ఆడితే సమస్య ఏముంటుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేశాడు. అతనికెప్పుడూ గౌరవం ఉంటుంది తెలిపారు. అంటే, విదేశీ గడ్డపైన మన యువీ సొగసైన బ్యాటింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్, మెరుపుల్లాంటి సిక్స్‌లు చూడొచ్చన్నమాట.