ఆ ఒక బాల్ వదిలేసినందుకు ధన్యవాదాలు...

ఆ ఒక బాల్ వదిలేసినందుకు ధన్యవాదాలు...

ఐపీఎల్ 2020 లో 9వ మ్యాచ్ నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ షార్జా వేదికగా జరిగింది. అయితే ఇందులో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 223 పరుగు చేసింది. ఓపెనర్లు రాహుల్ 69, మయాంక్ అగర్వాల్ 106 పరుగులు చేశారు. ఇక 224 పరుగుల భారీ స్కోర్ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. సంజు శాంసన్ 83, స్మిత్ 50 పరుగులతో ఈ మ్యాచ్ లో రాణించారు. ఇక చివర్లో 18 బంతుల్లో 51 పరుగులు కావాల్సిన సమయంలో రాహుల్ తెవాతియా ఒకే ఓవర్లలో ఐదు సిక్స్ లు బాదాడు. ఆ ఓవర్లలో 5వ బంతి మినహా మిగిత అన్ని బంతులను బౌండరీ బయటకు పంపించాడు. ఇక టీ 20 మ్యాచ్ లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైన ఆటగాడు భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టీ 20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్ సందర్భంగా యువరాజ్ వరుసగా ఆరు సిక్సర్లు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో కొట్టాడు. అయితే తెవాతియా కూడా ఆ ఒక సిక్స్ కొట్టిఉంటే యువరాజ్ సరసన నిలిచేవాడు. కానీ అతను మిస్ చేసాడు. ఇక ఈ విషయం పై యువీ తన ట్విట్టర్ వేదికగా... రాహుల్ తెవాతియా నువ్వు ఆ ఒక బంతి మిస్ చేసినందుకు ధన్యవాదాలు. మ్యాచ్ గెలిచినందుకు రాజస్థాన్ కు అభినందనలు'' అని చెప్పాడు.