యువరాజ్ సిక్సర్ల మోత..

యువరాజ్ సిక్సర్ల మోత..

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ దుమ్ముదులిపేస్తున్నాడు.. టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రతినిథ్యం వహిస్తోన్న యువీ.. జట్టు విజయాలు ఎలా ఉన్నా.. తన బ్యాటింగ్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదంటూ.. మరోసారి ఫ్యాన్స్‌కు తన షాట్లతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి యువీ.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. బ్రాంప్టన్‌ వూల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్‌ కెప్టెన్‌ యువీ.. 22 బంతులు ఎదుర్కొని.. ఐదు కళ్లు చెదిరే భారీ సిక్సర్లు, మూడు బౌండరీలతో 51 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన  బ్రాంప్టన్‌ వూల్వ్స్‌ 221 పరుగులు చేసి.. టొరంటో ముందు 222 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (35)తో కలిసి 44 బంతుల్లో 75 పరుగులు జోడించారు. అయితే ఈ రెండు వికెట్లు వెనువెంటనే పడిపోడంతో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది టొరంటో నేషనల్స్‌. కాగా, 21 బంతుల్లో మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి.. ఎడ్మోంటన్ జట్టుపై టొరంటో నేషనల్స్‌ టీమ్ గెలుపులో కీలక భూమిక పోషించిన యువీ... ఇక, విన్నిపెగ్‌ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 45 పరుగులతో చెలరేగిపోయాడు. 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.