మిస్టర్ 360కే బ్యాటింగ్ టిప్స్ చెప్తున చాహల్...

మిస్టర్ 360కే బ్యాటింగ్ టిప్స్ చెప్తున చాహల్...

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో చాల చురుకుగా ఉంటారు. అతని సహచరులు కూడా అతనితో సరదాగా వ్యవహరిస్తారు. అందులో చాహల్ తన స్నేహితులు మరియు సహచరుల పోస్ట్‌ పై కొన్ని ఉల్లాసకరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఎవరిని వదలని చాహల్ తాజాగా ఎబి డెవిలియర్స్ ను పట్టుకున్నాడు. మరో రెండు రోజులో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 కోసం అన్ని జట్లు ఎప్పుడో అక్కడికి చేరుకున్నాయి. తమ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే అసలైన మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆర్సీబీ ఆటగాళ్లు రెండు జట్లలా విడిపోయి మ్యాచ్ ఆడిన వీడియోను ఆ జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో చాహల్ డెవిలియర్స్ వద్దకు వెళ్లి బ్యాటింగ్ ఎలా చేయాలో టిప్స్ ఇస్తున్నాడు. చాహల్ మాటలు వింటూ ఎబిడి నవ్వుకుంటున్నాడు. అయితే ఇంతకముందు ఓసారి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాహల్ మాట్లాడుతూ... మా జట్టుకు ఎప్పుడు బౌలింగ్ లోపం ఉంటుంది. మాకు డెత్ ఓవర్ల బౌలింగ్ సరిగ్గా లేదు. ఆ కారణంగానే మేము దాదాపు 30 శాతం మ్యాచ్‌ల్ని ఓడిపోతున్నాము అని స్వయంగా తెలిపాడు. ఇక ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకొని ఆర్సీబీ జట్టు ఈ ఏడాది కప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే ఐపీఎల్ 2020 లో ఆర్సీబీ మొదటి మ్యాచ్ ఈ నెల 21న సన్ రైజర్స్ తో ఆడనుంది.