హిట్ మ్యాన్ హిట్ ఉమెన్ అయితే...?

హిట్ మ్యాన్ హిట్ ఉమెన్ అయితే...?

కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రీడా కార్యకలాపాలను నిలిపివేసింది, ఈ మహమ్మారి విజ్రుంభిస్తున్న సమయంలో ఆటగాళ్ళు కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ సమయంలో టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన టిక్‌టాక్ వీడియోస్ మరియు సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ లెగ్ స్పిన్నర్ సోషల్ మీడియాలో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ యొక్క ఫోటోను షేర్ చేసారు. అయితే హిట్ మ్యాన్ ను ట్రోల్ చేయడానికి చాహల్ ట్విట్టర్‌ లో రోహిత్ పక్కన అతను ఉమెన్ వెర్షన్ లో‌ ఉన్న ఫోటోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. దానికి "సో క్యూట్ యు లుకింగ్ రోహితా శారమ్మా భైయా'' అనే క్యాప్షన్ ఇచ్చాడు చాహల్. అయితే చాహల్ ను ప్రతిసారి హిట్ మ్యాన్ ట్రోల్ చేస్తుంటే ఇప్పుడు దానికి విరుద్ధంగా ఈ లెగ్ స్పిన్నర్ హిట్ మ్యాన్ ను హిట్ ఉమెన్ లాగా ట్రోల్ చేశాడు.