భార్యతో కలిసి ఐపీఎల్ ఓపెనింగ్ చేయబోతున్న రోహిత్..?

భార్యతో కలిసి ఐపీఎల్ ఓపెనింగ్ చేయబోతున్న రోహిత్..?

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో చాల చురుకుగా ఉంటారు. అతని సహచరులు కూడా అతనితో సరదాగా వ్యవహరిస్తారు. అందులో చాహల్ తన స్నేహితులు మరియు సహచరుల పోస్ట్‌పై కొన్ని ఉల్లాసకరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇక తాజాగా ఐపీఎల్ 2020 కోసం అన్ని జట్లు దుబాయ్ కి చేరుకున్నాయి. అక్కడ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్యతో కలిసి వర్కౌట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇక దీనిని చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పిన్నర్ చాహల్ ఫన్నీ కామెట్ జత చేసాడు. ఆ వీడియోకి ''ఈ సారి ఐపీఎల్ లో ఓపెనింగ్ వదినతో చేయబోతున్నారా..?'' అంటూ ట్రోల్ చేసాడు. ఇప్పుడే కాదు చాహల్ అనేక సందర్భాల్లో భారత జట్టు వైస్ కెప్టెన్ ను ఆటపాటిస్తు ఉంటాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ వచ్చే నెల 19 నుండి ప్రారంభం కానుంది.