మా జట్టు అందుకే ఐపీఎల్ లో ఓడిపోతుంది : చాహల్

మా జట్టు అందుకే ఐపీఎల్ లో ఓడిపోతుంది : చాహల్

విరాట్ కోహ్లీ ఆట గురించి అందరికి తెలుసు. ఆయితే ఆటగాడిగా అంత విజయం సాధించిన కోహ్లీ కెప్టెన్ గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తాను కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కి ఒక్కసారి కూడా టైటిల్  అందించాలేకపోయాడు. అయితే ఐపీఎల్‌ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు సార్లు టైటిల్ అందుకున్నాడు. ఇక మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ను మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. అలాగే గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు టైటిల్ అందించాడు. 

అయితే బెంగళూరు జట్టుకు గత ఆరేళ్లుగా ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ తమ జట్టు ఓటమికి కారణాలు ఏంటని చెప్పాడు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చాహల్ మాట్లాడుతూ... మా జట్టుకు ఎప్పుడు బౌలింగ్ లోపం ఉంటుంది. కానీ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్న ఒక్క ఏడాది తప్ప మిగిలిన అన్ని సీజన్లలో మాకు డెత్ ఓవర్ల బౌలింగ్ సరిగ్గా లేదు. మేము 16-17 ఓవర్ల వరకు ప్రత్యర్థులను కట్టడి చేస్తాము. కానీ.. ఆ తర్వాత వేసే డెత్ ఓవర్ల కారణంగానే మేము దాదాపు 30 శాతం మ్యాచ్‌ల్ని ఓడిపోతున్నాము. ఎలా అంటే... ఏ జట్టుకైనా ప్రత్యర్ధులు ఓ 16 ఓవర్ల వరకు 130 పరుగులు చేస్తే.. ఆ తర్వాత ఓవర్లలో మిగిత జట్ల పైన 160-170 పరుగులు చేస్తారు. కానీ అదే మా బౌలింగ్ లోనైతే ఏకంగా 200 స్కోర్ చేస్తారు. ఇదే మా సమస్య'' అని చాహల్ తెలిపాడు. అయితే ఆర్సీబీకి బ్యాటింగ్ ఎంత బలంగా ఉంటుందో బౌలింగ్ అంత బలహీనంగా ఉంటుంది.