నాకు బిర్యానీ పంపండి.. కేవలం 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను : చాహల్ 

 నాకు బిర్యానీ పంపండి..  కేవలం 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను : చాహల్ 

భారత ఆటగాళ్లలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉండే వారు ఎవరు అంటే మొదట యుజ్వేంద్ర చాహల్ తర్వాత విరాట్ కోహ్లీ పేర్లు వినిపిస్తాయి. అయితే ఈ రోజు విరాట్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసారు. అందులో కోహ్లీతో పాటుగా భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఆ పోస్ట్ లో.. "మా నుండి 500 మీటర్ల దూరంలో నివసించే ఒక రకమైన పొరుగువారు ఇంట్లో తయారుచేసిన కొన్ని నీర్ దోసలను తెచ్చి నన్ను ఆనందపరిచ్చారు. మీకు పెద్ద ధన్యవాదాలు.. ఎందుకంటే మాకు చాలా కాలం నుండి ఇంత రుచికరమైన దోసలు లేవు. అయితే మేము తిరిగి పంపిన పుట్టగొడుగు బిర్యానీని మీరు ఆస్వాదించారని ఆశిస్తున్నాను" అని అయ్యర్ ను ఉద్దేశించి పోస్ట్ కోహ్లీ చేసారు. అయితే ఈ పోస్ట్ ను భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చూసాడు. ఇక దానిపై స్పందిస్తూ.. "దయచేసి కొన్ని బిర్యానీలను నాకు పంపండి, నేను మీకు కేవలం 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను'' అని కామెంట్ జత చేసాడు. ఇక ఈ విషయం పై భారత సారథి ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి.