నన్ను సరైన మార్గంలో నడిపించేది అతనే : చాహల్

నన్ను సరైన మార్గంలో నడిపించేది అతనే : చాహల్

భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనికి ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికి తెలుసు. కానీ ఈ ఏడాది యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో ధోని న్యాయకత్వం లోని చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమవడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న మెదటి జట్టుగా చెత్త రికార్డు నెలకొల్పింది. అయితే వరుస పరాజయాలతో ఉన్న చెన్నై గత మ్యాచ్ లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత బెంగళూరు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఎంఎస్ ధోని తో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోకు చాహల్ “నన్ను ఎప్పుడూ సరైన మార్గంలో నడిపించేవాడు .... మాహి భాయ్'' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న బెంగుళూరు రేపు ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది.