నా పిజ్జాను దొంగలించారంటున్న స్పిన్నర్ చాహల్...

నా పిజ్జాను దొంగలించారంటున్న స్పిన్నర్ చాహల్...

తన పిజ్జాను దొంగలించారంటూ భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే చాహల్, యూట్యూబర్, కొరియో గ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని గతంలో తానే స్వయంగా ప్రకటించాడు. కొంతకాలంగా ధనశ్రీతో చాహల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చని విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లీ ముహుర్తం ఖరారు చేసేందుకు జరిపిన రోకా వేడుకలో చాహల్ ధనశ్రీ తో దిగ్గిన ఫోటోలను అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ తనకు కాబోయే భార్యతో దిగ్గిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దానికి 'మీరు నా హార్ట్‌ పిజ్జాను దొంగిలించారు' అనే క్యాప్షన్‌ జోడించాడు. ఇక తనకు కాబోయే భర్త పోస్ట్ కు ధనశ్రీ వెంటనే స్పందించింది. దానికి  'అవును దొంగిలించాను. ఒప్పుకుంటున్న’ అంటూ పిజ్జా తో పాటు రెండు హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ ను జత చేసింది. అయితే ప్రస్తుతం చాహల్ ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ కి వెళ్ళాడు.