వీడియో షేర్ చేస్తూ పంత్ ను ట్రోల్ చేసిన చాహల్... 

వీడియో షేర్ చేస్తూ పంత్ ను ట్రోల్ చేసిన చాహల్... 

కరోనా కారణంగా వచ్చిన విరామం లో అందరూ భారత ఆటగాళ్లు తమ ఫిట్నెస్ పైన  లేదా కొత్తవి ఏమైనా నేర్చుకోవటం పై  తమ దృష్టి పెడుతున్నారు. కానీ  ఈ ఆటగాడు మాత్రం మిగిత ఆటగాళ్లను ట్రోల్ చేయడమే తన పనిగా పెట్టుకున్నాడు. అతను ఎవరో కాదు  స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా ఎవరిని వదలని చాహల్ తాగాజా భారత యువ వికెట్ కీపర్  రిషభ్‌ పంత్ ను ట్రోల్ చేసాడు. పంత్  తన కోచ్‌ నిక్‌వెబ్‌ నేతృత్వంలో బాక్సింగ్‌ చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు చాహల్.  ఈ వీడియోలో పంత్‌ పంచ్‌ విసురుతుంటే పక్కన ఉన్న చాహల్ అతన్ని అనుకరించాడు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు కరోనా లాక్ డౌన్ కంటే ముందుది.  ఈ  పోస్ట్ కు చాహల్ "పంత్‌ ఎందుకు అలిసిపోతున్నావు ఇది నా ట్రేనింగ్" అనే క్యాప్షన్‌‌ ఇచ్చాడు. దీనికి స్పందించిన పంత్ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ పంత్ బాక్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా  కారణనంగా ఇంటికే పరిమితం అయిన ఆటగాళ్ళు ఇలా తమ పాత విషయాలు గుర్తుచేసుకుంటున్నారు.