బర్న్లేతో పోరాటానికి జహ దూరం

బర్న్లేతో పోరాటానికి జహ దూరం

లండన్: బర్న్‌లేతో జరగనున్న మ్యాచ్‌కు విల్‌ఫ్రీడ్ జహా దూరమయ్యాడు. కరోనా పరీక్షలో పాజిటివ్ రావడటమే అందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉంత్కంఠతో కొనసాగుతుంది. ప్రతి జట్టు తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ లీగ్‌లో తరువాత క్రస్టల్ ప్యాలెస్ జట్టుకు, బర్న్‌లేకు జరగనున్న మ్యాచ్‌కు క్రిస్టల్ ప్యాలెస్ ఆటగాడు విల్ ఫ్రీడ్ జహా దూరమయ్యారు. అతడికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవనీ, కానీ పాజిటివ్ ఫలితం రావడంతో అతడిని చికిత్స కోసం క్వారంటైన్‌లో ఉంచామని ఆ జట్టు మేనేజర్ రోయ్ హాడ్జ్‌సన్ తెలిపారు. అతడి స్థానంలోకి మిచి బట్షుయి జట్టులోకి రానున్నాడని యాజమాన్యం తెలిపింది. ‘జాహా అనుకోకుండా కరోనా బారిన పడ్డాడు. అతడికి ఎటువంటి లక్షణాలు లేవు. అయితే రెండో విడత పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం అతడి నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నాడ’ని హడ్జ్‌సన్ తెలిపారు. చివరి మ్యాచ్‌లో క్రిస్టల్ ప్యాలెస్ 1-0తో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. అయితే తరువాతి మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. జహా తిరిగి జట్టులోకి రావాలన అతడి అభిమానులు కోరుకుంటున్నారు.