పాండ్యా ట్వీట్.. జహీర్ ఫ్యాన్స్ ఫైర్..

పాండ్యా ట్వీట్.. జహీర్ ఫ్యాన్స్ ఫైర్..

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యా జహీర్ ఖాన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.  జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే జాక్.. నేనిక్కడ కొట్టినట్టే.. నువ్వు మైదానం బయట దంచికొడతావనే ఆశిస్తున్నా అని ట్వీట్ ట్వీట్ చేశారు.  హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ పై జహీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ముందు మైదానంలో సరిగా ఆడాలని, టివిషోలలో మాట్లాటం నేర్చుకోవాలని జహీర్ అభిమానులు సూచించారు.  2011లో ప్రపంచకప్ గెలిచిన ఇండియా జట్టులో ఉన్నాడని, జహీర్ లా ప్రపంచకప్పు గెలిపించు అని జహీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మైదానంలో దూకుడుగా కనిపించే పాండ్యా.. బయటకూడా అదే దూకుడును ప్రదర్శిస్తూ.. విమర్శల పాలవుతున్నాడు.