అల్లు అర్జున్ డ్యాన్స్ కు ఆ హీరోయిన్ ఫిదా..!!

అల్లు  అర్జున్ డ్యాన్స్ కు ఆ హీరోయిన్ ఫిదా..!!

అల్లు అర్జున్ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు.  సినిమాల్లోకి ఎంటర్ కాకముందే మెగాస్టార్ సినిమా డాడీలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు.  ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ.. అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు.  టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  

ఇదిలా ఉంటె, అల్లు అర్జున్ డ్యాన్స్ కు కేవలం టాలీవుడ్ సెలెబ్రిటీస్ మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ కు చెందిన సెలెబ్రిటీస్ కూడా ఫిదా అవుతున్నారు.  ఈ లిస్ట్ లో ఇప్పుడు జరీన్ ఖాన్ కూడా చేరింది.  బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు గోపీచంద్ చాణక్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.  అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని చెప్పింది.  దీని అర్ధం, ఎలాగో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, పనిలో పనిగా టాప్ హీరోలకు గాలం వేస్తోందన్నమాట.