మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్.!

మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్.!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతోపాటు అధికారులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతుండగా..మరి కొందరు కరోనా ను జయించారు. తాజాగా బాలివుడ్ నటి జరీనా వహాబ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారం జరీనా జ్వరం, శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు ఉండటంతో ముంబైలోని ఓ ప్రైవేట్  ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆమె చికిత్స తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమెకు అస్వస్థత లేకపోవడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జరీనా పలు భారతీయ భాషల్లో వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె ప్రస్తుతం తెలుగులో మావో కథాంశంతో రానా, సాయి పల్లవి  హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న విరాటపర్వం మూవీలో సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు.