జియోతో బ్రేకప్.. ఎయిర్ టెల్ తో టైఅప్

జియోతో బ్రేకప్.. ఎయిర్ టెల్ తో టైఅప్

దేశంలో అతిపెద్ద మీడియా కంపెనీ జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ (జీ) టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్ టెల్ తో మూడేళ్ల భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకొంది. ఇటీవలే జీ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో ధరలపై అంగీకారం కుదరకపోవడంతో ఒప్పందం రద్దు చేసుకొంది. దీంతో జీ తన నెట్ వర్క్ కి చెందిన కంటెంట్ అంతా జియో నుంచి తొలగించింది. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఎయిర్ టెల్ కి చెందిన వీడియో-ఆన్-డిమాండ్ యాప్ ఎయిర్ టెల్ టీవీ, జీకి చెందిన ఓవర్-ద-టాప్ యాప్ జీ5 సంయుక్తంగా ఎయిర్ టెల్ టీవీ, జీ5 కోసం ప్రత్యేకంగా కంటెంట్ తయారుచేస్తాయి. ఈ ఒప్పందంతో ఎయిర్ టెల్ టీవీ యాప్ కి చెందిన 5 కోట్లకు పైగా యూజర్లు జీ5 మూవీ, టీవీ షో, ఇతర కంటెంట్ చూడవచ్చు. దీనికి సబ్ స్క్రిప్షన్ ధర ఎయిర్ టెల్ టీవీ ప్లాన్ లో బండిల్ చేయనున్నారు.