రిషబ్ పంత్ కు ధోనీ కుమార్తె పాఠాలు

రిషబ్ పంత్ కు ధోనీ కుమార్తె పాఠాలు

భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ వీడియోలో జీవా, పంత్ ఎంతో క్యూట్‌గా ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పంత్‌ కూడా ధోనీలా చాలా కూల్ వ్యక్తి అని అభిమానులు అంటున్నారు. ఇంతకుముందు ఆసీస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పెయిన్‌ను స్లెగ్జింగ్ చేసిన రిషబ్ పంత్... ఆ తర్వాత అతని భార్యతో ‘బెస్ట్ బేబీ సిట్టర్’గా కాంప్లిమెంట్ పొందిన సంగతి తెలిసిందే.