జొమాటో నుంచి 541 ఉద్యోగులు ఔట్..

జొమాటో నుంచి 541 ఉద్యోగులు ఔట్..

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మరియు రెస్టారెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ జొమాటో 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది.. గుర్గావ్‌లోని జొమాటో యొక్క ప్రధాన కార్యాలయంలో కస్టమర్, వ్యాపారి మరియు డెలివరీ భాగస్వామి సహాయక బృందంలోని 541 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం తొలగించబడిన ఉద్యోగుల సంఖ్య 10 శాతంగా ఉంటుందని పేర్కొంది జొమాటో. తమ ప్లాట్‌ఫాంపై త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత బాట్స్, ఆటోమేషన్ టెక్నాలజీతో కస్టమర్ల సమస్యలను పరిష్కరించనున్నామని, అందుకనే ఉద్యోగులను తొలగించామని, దీంతో డబ్బు ఆదా అవుతుందని తన ప్రకటనలో పేర్కొంది. అయితే, తొలగించిన ఉద్యోగులకు 2 నెలల వేతనంతోపాటు జనవరి 2020 వరకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నామని పేర్కొంది. తాజాగా ఉద్యోగులను తగ్గించిన తర్వాత జొమాటో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 5,000 మందిగా ఉన్నట్టు చెబుతున్నారు.